
–డిసిఏంఎస్ కాంప్లెక్స్ వద్ద ఎన్నో ఏళ్ళ డ్రైనేజీ సమస్య పరిష్కారం!
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోగల డిసిఎంఎస్ కాంప్లెక్స్ లో లీక్ డ్రైనేజీ సమస్య ఇబ్బంది పెడుతున్న విషయం విధితమే. చాలా సంవత్సరాలుగా డ్రైనేజీ ఎప్పుడు జామ్ అవడంతో మురుగు నీరంతా రోడ్డుపై ప్రవహించి తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఎన్ని సార్లు క్లిన్ చేసిన ప్లాస్టిక్ తో మళ్ళి జాం కావడంతో మున్సిపల్ సిబ్బంది దాన్ని తొలగించడానికి నానా తంటాలు పడాల్సి వచ్చేది. మున్సిపల్ పరిధిలో గల అన్ని వార్డులలో డ్రైనేజీలు పూర్తి అయినప్పటికీ డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో మాత్రం ఈ డ్రైనేజీని ఎవరు పట్టించుకోలేదు. ఎన్నోసార్లు డిసిఎంఎస్ అధికారులు, వ్యాపారస్తులు మున్సిపల్ అధికారుల, పాలకుల దృష్టికి తీసుకువెళ్లిన స్పందించలేదు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ కే సమ్మయ్య సదరు డ్రైనేజీని పరిశీలించి ఎట్టకేలకు నూతన డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని ఆదేశించారు. కొన్ని ఏళ్ల సమస్యను సకాలంలో పరిష్కరించేందుకు ముందుకు వచ్చి కృషి చేస్తున్న కమిషనర్ సమ్మయ్యకు పలువురు అభినందనలు తెలిపారు.



