
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట వద్ద గల పాటి మీద ఆంజనేయస్వామి సహిత సరస్వతి మాత ఆలయానికి పట్టణానికి చెందిన బద్దం ముత్యంరెడ్డి_శారద దంపతుల కూతురు అల్లుడు ఎన్నారై ముస్కు సుస్మిత శ్రీకాంత్ రెడ్డిలు సూమరు రూ. 20,000 విలువైన దీపపు_చెమ్మలను మొక్కుగా ఆలయానికి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ నాయకులు గందే శ్రీనివాస్, అపరాజ ముత్యం రాజు, ఆలయ పూజారులు తిరుమలాచార్యులు, ప్రదీప్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.







