
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట పట్టణంలోని చాణక్య డిగ్రీ కళాశాలలో 2008- 11 విద్యా సంవత్సరానికి సంబంధించిన కామర్స్ జనరల్ విభాగం విద్యార్థిని విద్యార్థులు ఈరోజు స్థానిక పద్మశాలి భవన్ లో గెట్ టు గెదర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ మాట్లాడుతూ తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వారు ఈ స్థాయిలో ఉండడానికి గురువులే కారణమని గురువులందరినీ స్మరించుకుంటూ వారిని గొప్పగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల కరస్పాండెంట్ విజయ, రవీందర్ డైరెక్టర్ బట్టి ప్రభాకర్, ప్రిన్సిపాల్ విజేందర్ రెడ్డి, కామర్స్ లెక్చరర్ ప్రవీణ్ కుమార్, తెలుగు లెక్చరర్ సురేష్, ఎకనామిక్స్ లెక్చరర్ పద్మాలత, కామర్స్ లెక్చరర్ స్వాతి, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ విజయ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులందరూ మంచి ఉన్నత స్థితిలో ఉండడం గర్వకారణమని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నానని అలాగే తమ భవిష్యత్ ఎదుగుదలకి తమ పిల్లల భవిష్యత్ కోసం సరైన క్రమశిక్షణను వారికి నేర్పుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.







