
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్:
హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1987-88 ఏడో తరగతి చదివిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు ఎర్రం పాపిరెడ్డి, కనుకయ్య, రఘుపతిరెడ్డి, బొక్కల వీరారెడ్డిలను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారి జ్ఞాపకాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు పంచుకున్నారు. విద్యార్థిని, విద్యార్థులు వారు చదువుకున్న రోజుల్లో కొన్ని సంఘటనలను గుర్తు చేసుకున్నారు. బండారి లక్ష్మణ్, తోడేటి సత్తయ్య (సతీష్)ల సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మిడిదొడ్డి సారయ్య, తిప్పారపు లింగయ్య, ఎం డి అబ్దుల్ రహీమ్ (బుడ్డోడు),
తుమ్ముల నర్సయ్య, కాసిరెడ్డి రామ్ రెడ్డి, బోడ స్వరూప, కె.పార్వతి, ఆరెపల్లి స్నేహలత (ఐలమ్మ), ఆడెపు మల్లికార్జున్, జంజిరాల రమాదేవి, నిమ్మల కొండాల్ రెడ్డి, బేతి విమల, నిమ్మల హైమావతి, కాసిరెడ్డి రత్నమాల, నిమ్మల మధుసూదన్, శ్రీనివాస్ రెడ్డి, గుండ తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


తుమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1987-88 ఏడో తరగతి చదివిన పూర్వవిద్యార్థులు





