Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు కోరారు. గురువారం హైదరాబాద్ సెక్రటేరియట్ లో మంత్రి అట్లూరిని ప్రణవ్ బాబు మర్యాద పూర్వకంగా ఆయన కలిశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ప్రొసీడింగ్ ఇచ్చి అసంపూర్తిగా నిర్మించిన భవనం పూర్తి చేయడం కోసం నిధులు మంజూరు చేయాలని, దళిత బంధు గ్రౌండింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు దళిత బంధు అందేలా చూడాలని, హుజురాబాద్ నియోజవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ పాఠశాలలో వసతులకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రణవ్ బాబు పలుమార్లు కోరిన నేపథ్యంలో వాటి మంజూరు కి మంత్రి హామీ ఇచ్చారు.





