
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా చేనేత సెల్ జిల్లా అధ్యక్షునిగా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బండారి సదానందంని నియమిస్తూ ఈరోజు సిద్దిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ చేనేత సెల్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ ఉత్తర్వులు అందజేశారు.

ఈ సందర్భంగా బండారి సదానందం మాట్లాడుతూ తన నియమకానికి సహకరించిన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల శ్రీధర్ బాబుకి, అడ్లురు లక్ష్మణ్ కుమార్ కు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యంకి మరియు ప్రత్యేకంగా నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబుకి సదానందం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన చేనేత సెల్ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రామచంద్రంకి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాజీపేట శ్రీనివాస్, బీసీ నాయకులు కన్నబోయిన మహేందర్ యాదవ్, హుజురాబాద్ మెడికల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ సంగం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘం శ్రీనివాస్ పాల్గొన్నారు.





