
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సమాజంలో మధ్యతరగతి జీవితాన్ని గడుపుతున్న ప్లంబర్, ఎలక్ట్రీషియన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ స్వయంకృషి ప్లంబర్ యూనియన్ అధ్యక్షులు మోరే రవి, శుభ జ్యోతి ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సంగెం వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి జున్నుతుల శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు.

పట్టణంలో బ్యానర్ పట్టుకొని పట్టణంలో ర్యాలీ తీస్తున్న ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్ యూనియన్ల నాయకులు, సభ్యులు..

మంగళవారం హుజూరాబాద్ పట్టణంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించి హుజురాబాద్ తహసిల్దార్ జక్కని నరేందర్ కు వినతి పత్రంలు వేరువేరుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ…. ప్లంబర్, ఎలక్ట్రిషన్ పని చేసుకుంటూ జీవిస్తున్న కార్మికులు పేదరికంలో ఉన్నారని వారికి ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని, 60 సంవత్సరాల పైన ఉన్నవారికి కూడా పింఛన్ ఇవ్వాలని, సంఘ భవనం కోసం ప్రభుత్వ స్థలం ఒక గుంట కేటాయించాలని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తమ కూలీరేట్లను పెంచడం జరిగిందని వాటిని కూడా చట్ట ప్రకారంగా అమలయ్యేలా కార్మిక శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఇందుకు ప్రజలు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్లంబర్, ఎలక్ట్రిషన్ కార్మికులు సబ్బని రాజేందర్, సంఘాల రమేష్, కొలిపాక రమేష్, అల్లి శ్రీనివాస్, ప్రశాంత్, బి సునీల్, విశ్వనాథ్, రాజు, ప్రవీణ్, రాజయ్య, శ్రీధర్, మత్స్యగిరి, ఏ చిరంజీవి, రమేష్, చారి, గౌడగాని రాజన్న, టి రామ్ శంకర్, ఇ శంకర్, వి కరుణాకర్, పి విశ్వనాధ్, ఎన్ రాజయ్య, గజ్జల రాజు, కదిరే శ్రీనివాస్, మోరే ప్రవీణ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

తాసిల్దార్ వినతి పత్రం అందజేస్తున్న ప్లంబర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు..





