Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎన్నికల సంఘం రూపొందించిన ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న తీరు తెన్నులపై బిఆర్ఎస్ నాయకులు నిశితంగా పరిశీలించాలని, ప్రతి ఓటర్ కు న్యాయం జరిగేలా చూడాలని హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, టిఎస్ టిఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమిళ్ళ రాకేష్ అన్నారు. బుధవారం ఆయన హుజురాబాద్ లో ఎస్ ఆర్ ఐ ప్రక్రియ తీరుతెన్నులపై నాయకులతో సమీక్షించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…
హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ (SIR )ప్రక్రియలో ప్రతి ఓటు ఎంతో కీలకమని, ప్రతి అర్హులైన ఓటరు తమ పేరు ఓటరు జాబితాలో నమోదైందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని అన్నారు. ఇప్పటివరకు అర్హులైన ప్రతి ఓటరుకి సంబంధిత దరఖాస్తు ఫారాలు అందాయా లేదా అనే విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పరిశీలించాలని ఆయన సూచించారు. ఫారాలు అందని వారికి వెంటనే అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు వంటి అంశాల్లో ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. ప్రజలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే బాధ్యతను గుర్తించి, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటరు జాబితాలో తమ పేరు నమోదైందో లేదో ధృవీకరించుకోవాలని, నమోదు కాని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగళి రమేష్, కౌన్సిలర్ గందె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





