
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రాంతానికి చెందిన యువ నాయకుడు పల్లె ప్రశాంత్ ను బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ బీఎస్పీ సెంట్రల్ కో ఆర్డినేటర్ అతార్ సింగ్ రావు ప్రకటించారు. బుధవారం హైదరాబాదులో బీఎస్పీ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం జరుగగా యువతకు స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ప్రశాంత్ కు ఈ అవకాశం కల్పించారు. ప్రశాంతి నియామకం పట్ల బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరాం కృష్ణ, జోన్ చీఫ్ ఇంచార్జులు దాగిల్ల దయానందరావు, నిషాని రామచంద్రం, బోడపట్ల ఈశ్వర్ లు అభినందనలు తెలిపారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకమైన పల్లె ప్రశాంత్ తో ఇతర రాష్ట్ర నేతలు..





