
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాసంస్థలకు పక్కాభవనాలు నిర్మించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రోజున హుజురాబాద్లో ఉన్న బాలికల గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ నియోజవర్గంలో సైదాపూర్, వీణవంక మండలాల కేటాయించిన బీసీ గురుకుల పాఠశాల పక్కా భవనాలు హుజురాబాద్ కేంద్రానికి మార్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గురుకుల విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తామని మాటలకే పరిమితం అవుతున్నారని, ఆచరణలో విఫలం అవుతున్నారన్నారు. బాలికల గురుకుల పాఠశాలలో కరెంటు సమస్య ఉందని, బయట వైర్లు ఉండడం వల్ల విద్యార్థులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. తరగతి గదులు లేక వరండాలో క్లాసులు నిర్వహిస్తున్నారని, వెంటనే తరగతి గదులు నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 465 మంది విద్యార్థులతో ఈ గురుకుల పాఠశాల నడుస్తుందని, ప్రతి సంవత్సరం మంచి మార్కులతో విద్యార్థినిలు ఉత్తీర్ణులు అవుతున్నారు. పాఠశాల చుట్టుపక్కల ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి ఈ పాత బిల్డింగ్ విద్యార్థులకు అసౌకర్యంగా ఉందని అన్నారు. ఇక్కడ పక్క భవనాలు లేకపోవడం వల్ల ఇక్కడి కళాశాలలను వేరేచోట అద్దె భవనాలు తీసుకొని తరగతులు నిర్వహిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఈ గురుకుల పాఠశాలకు పక్క భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలో పనిచేసే ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ పర్మనెంట్ చేయాలన్నారు. పైన పేర్కొన్న సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరించాలని లేనియెడల CPM పార్టీ ఆధ్వర్యంలో పసలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కొప్పుల శంకర్, మండల కమిటీ సభ్యులు ప్రతాప శ్రీనివాస్, ఇమ్మడి దేవయ్య, కొంకటి చంద్రయ్య, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వడ్లూరి కిషోర్, పట్నం జిల్లా నాయకులు సతీష్, అజ్జు, కుమార్, శ్రీకాంత్, రాజు, తదితరులు పాల్గొన్నారు.





