
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో కూరగాయల సంత పునర్ ప్రారంభం అయింది. గత కొన్ని సంవత్సరాల నుండి చేల్పూరు గ్రామంలో కూరగాయల సంత ప్రతి ఆదివారం రోజు చుట్టూ ప్రక్కన ఉన్న పల్లె ప్రాంతాల నుండి రైతులు అధిక సంఖ్యలో ప్రతి వారం వారి వారి భూములలో పండించిన కూరగాయలు మరియు ఆకుకూరలను తెంపుకొని అంగడికి తీసుకొని వచ్చేవారు. అలా తీసుకువచ్చిన కూరగాయలను, ఆకుకూరలను ఆ ఊరి గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్న పల్లె ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి వాటిని కొనుగోలు చేసేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు అద్భుతంగా కూరగాయల మార్కెట్ ను కొనసాగించారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం అంగడి కనుమరుగైపోయింది. ఇప్పుడు గ్రామ ప్రజల కోరిక మేరకు మళ్ళీ ఈరోజు నుండి కూరగాయల మార్కెట్ ను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా చుట్టుప్రక్కల ఉన్న వ్యవసాయదారులు వారు పండించిన కూరగాయలను, ఆకుకూరలను అధిక సంఖ్యలో తీసుకొని వచ్చి చెల్పూర్ లో విక్రయిస్తుండడంతో గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంతలో రైతులు విక్రయించేలా గ్రామపంచాయతీ తగిన ఏర్పాట్లు చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావలసిన సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా పలువురు రైతులు పేర్కొన్నారు.




చెల్పూర్ లో పునర్ ప్రారంభమైన సంత దృశ్యాలు..





