
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పట్టణానికి చెందిన మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రజాకవి రచయిత ఆధ్యాత్మిక గురువు తత్వవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యంగౌడ్ ను జాతీయస్థాయి తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకొని ఆ సంస్థ వ్యవస్థాపకులు పోలోజు రాజకుమార్ సత్యoగౌడ్ జాతీయ స్థాయి ఉత్తమ సేవా పురస్కారం అందజేశారు. సత్యం గౌడ్ సామాజిక సేవలు, వారి రచనలు, ఆధ్యాత్మిక బోధనలు గుర్తించి ఉగాది జాతీయస్థాయి ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేసి ఈ రోజు పురస్కారాన్ని హుస్నాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం భవనంలో ఆదివారం సత్యంగౌడ్ కు పట్టు శాలువా కప్పి బొకేను, జ్ఞాపికను అందజేసి, తలకు గౌరవ కిరీటమును ధరింపజేసి ఉగాది జాతీయస్థాయి ఉత్తమ సేవ పురస్కారంతో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పోలోజు రాజకుమార్, ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ టీవీ మరియు సినీ నటులు, కవి, రచయిత ఆర్ఎస్ నంద మరియు వివిధ స్వచ్ఛంద సేవ సంస్థల అధ్యక్షులు సత్య గౌడ్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపకులు రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్ఎస్ నంద మాట్లాడుతూ…సత్యంగౌడ్ సామాజిక రచనలు వారి సేవలు ఆధ్యాత్మిక బోధనలు ఆదర్శప్రాయం అన్నారు. సమాజానికి ఉపయోగపడే రచనలు రాణిస్తూ, ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్న సత్యంగౌడ్ నిస్వార్థ సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రజాకవి రచయిత ఆధ్యాత్మిక గురువు సత్యంగౌడ్ మాట్లాడుతూ….ప్రతి ఒక్కరు సేవాభావాన్ని అలవర్చుకొని సమాజసేవలో భాగస్వాములై నవభారత నిర్మాణానికి పునాదిగా నిలవాలన్నారు. ప్రతి పౌరుడు ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకొని మనసును ప్రశాంతంగా నిలుపుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు. ఎవరికి హాని కలిగించగా జీవించడంలోనే మానవజన్మ సార్థకం అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అంటరాని స్వార్థానికి దూరంగా ఉండి లోక కల్యాణంలో భాగస్వాములై మంచి మనిషిగా పేరు తెచ్చుకోవాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల అధ్యక్షులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, కళాకారులు, గాయకులు, టీవీ మరియు సినీ నటులు, నృత్య కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

