
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలోని దిలీప్ బ్యుల్డ్ కాన్ కంపెనీ ఉద్యోగులు సిబ్బందికి ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. ఈ శిభిరంలో 120 మందికి ఆసుపత్రి వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, 2డి ఎకో పరీక్షలు చేపట్టి రోగ నిర్దారణ చేశారు. ఈ సందర్బంగా మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ…తుమ్మనపల్లి లోని బ్యుల్డ్ కాన్ కంపెనీ ఉద్యోగులు సిబ్బందికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో 24 గంటలు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ ఉచిత వైద్య శిభిరంలో ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.