
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈనెల (ఏప్రిల్ )27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో గ్రాండ్గా జరగనున్న భారత రాష్ట్ర సమితి (BRS) రజతోత్సవ సభ సందర్భంగా, హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి సభ ప్రచార పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం హుజురాబాద్ పట్టణంలోని ముఖ్య కూడళ్లలో గోడలపై పోస్టర్లను అంటించి, వరంగల్ సభ అపూర్వ విజయాన్ని సాధించాల్సిన లక్ష్యంతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. గడపగడపకు స్వచ్ఛందంగా తరలివరీ విజయవంతం చేయాలని కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రజతోత్సవ వాల్ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

అంబేద్కర్ చౌరస్తాలోని జమ్మికుంట ప్రధాన రహదారిలో డివైడర్ కు వాల్పోస్టర్ అంటిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..





