
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ హాకీ క్లబ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారుడు గుడ్డేలుగుల సమ్మయ్య ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎగగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా తోట రాజేంద్రప్రసాద్, సెక్రటరీగా బొడిగ తిరుపతిగౌడ్, ఉపాధ్యక్షులుగా భూసారపు శంకర్, ఆరేల్లి రమేష్, వేముల రవికుమార్, డియూసుఫ్, జాయింట్ సెక్రెటరీగా శ్యాంసుందర్, సిహెచ్ రాజు, జి ప్రదీప్, ఎన్ సాయికృష్ణ,
ట్రెజరరిగా ఏం రాజేష్ఆర్గరైజింగ్ సెక్రటరీగా కే రాజేష్, ఎస్ విక్రమ్, యు భాస్కర్ రెడ్డి, ఏం వినయ్, పి సాంబరాజు. కోచ్గా ఎం విక్రమ్, సలహాదారులుగా జి,సమ్మయ్య, పవన్ కుమార్, బీ రఘు, సిహెచ్ శ్రీనివాస్, కే బిక్షపతి, ఈ జాని, ఎన్ బాలరాజు, కార్యవర్గ సభ్యులుగా పరబ్రహ్మం, సన్నీ, వినీత్, విపుల్, రోహన్, రాజకుమార్, వంశీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా హాకీకి తోడ్పాటు అందిస్తూ అనేక టోర్నమెంట్లు నిర్వహించామని, మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించేందుకు హాకీ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు సజ్జుతో పాటు తదితరులు పాల్గొన్నారు.


అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్..

ప్రధాన కార్యదర్శి బొడిగె తరుపతి గౌడ్