
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ సూచనలతో, జిల్లాలోని 15 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ ప్రక్రియను 100 శాతం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
సమీక్షా సమావేశం వివరాలు: 2027 మందికి ఇండ్లు మంజూరు
730 ఇండ్లకు మార్కింగ్ పూర్తయ్యింది, 114 ఇండ్లు బేస్మెంట్ లెవెల్ కు చేరాయి
ప్రధాన ఆదేశాలు:
మిగిలిన ఇండ్లకు మార్కింగ్ త్వరగా పూర్తిచేయాలి
లబ్ధిదారులతో చర్చించి పనులు వేగవంతం చేయాలి
రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలి
గ్రామాలు/మున్సిపల్ వార్డుల వారీగా అలాట్మెంట్ జాబితా సిద్ధం చేయాలి, అత్యంత నిరుపేదలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. హాజరైన అధికారులు: అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, జడ్పీ సీఈఓ శ్రీనివాస్, డిటిడిఓ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్లు..





