Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
నిబంధనల ప్రకారం మైనర్లు వాహనాలను నడపరాదని, మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జీ అన్నారు. గురువారం హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, మైనర్ డ్రైవింగ్ లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ డివిజన్లోని హుజురాబాద్ లో 32, జమ్మికుంటలో 19, వీణవంకలో 13, సైదాపూర్ లో 3, కేశపట్నంలో 5, ఇల్లందకుంటలో 10 నెంబర్ ప్లేట్ లేని వాహనాలను పట్టుకున్నారు. మైనర్ లు డ్రైవింగ్ చేసిన వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాల వారికి, మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే బాధ్యులు తల్లిదండ్రులు అవుతారని, రెండవసారి పట్టుబడితే కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని తల్లిదండ్రులను ఏసిపి హెచ్చరించారు. డివిజన్లో ఎప్పటికీ ఈ విషయంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు టి కరుణాకర్, వి రవి, కిషోర్, పులి వెంకట్ గౌడ్, సబ్ ఇన్స్పెక్టర్లు యూనస్ అహ్మద్ అలీ, తిరుపతి, శేఖర్ రెడ్డి, రవి, రాజ్ కుమార్, తిరుపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










