
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నిత్యం వ్యాయామం చేసేవారు పౌష్టికాహారం తీసుకోవాలనీ అప్పుడే ఆరోగ్యవంతంగా ఉంటారని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య పేర్కొన్నారు. ఈరోజు హుజురాబాద్ పట్టణంలోని హైస్కూలు గ్రౌండ్లో రెవెన్యూ ఉద్యోగి, సామాజిక కార్యకర్త పాక సతీష్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపులో భాగంగా160 మంది విద్యార్థిని విద్యార్థులకు ఫ్రూట్స్ మరియు ఎగ్స్ పాక సతీష్ డిస్ట్రిబ్యూషన్ చేసారు. ఈ సందర్భంగా దాత సతీష్ మాట్లాడుతూ పట్టణంలోని చిన్నారులు, విద్యార్థుల కోసం మున్సిపల్ కమిషనర్ ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపులను చిన్నారులు విద్యార్థులు, యువతీ యువకులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, మాజీ కౌన్సిలర్ తాళ్ళపెళ్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయుడు పలకల ఈశ్వర్ రెడ్డి, వాకర్స్ నాయకులు మక్కపెల్లి రమేష్ పొడిశెట్టి వెంకట్రాజం, శ్రీనివాసరెడ్డి, గోవర్ధన్, పరంకుశం కిరణ్ కుమార్, క్యాష ఉపేందర్, సాయి, మునిసిపల్ సిబ్బంది ప్రతాప రాజు, రొంటాల సుధీర్, వినయ్, నరేష్, అనిల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


క్రీడాకారులు విద్యార్థులకు పండ్లు, గుడ్లు పంపిణీ చేస్తున్న కమిషనర్ సమ్మయ్య, దాత సతీష్, తదితర వాకర్లు..





