
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, ముగ్గురు EC మెంబర్లకు ఓటింగ్
వివాదాలు, ఓటర్లలో అయోమయం నెలకొన్న హుజురాబాద్ వాకర్ అసోసియేషన్ ఎన్నికలు ఎట్టకేలకు ఆదివారం ఉదయం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉదయం నుండి ప్రారంభమైన ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, 3EC మెంబర్లకు ఎన్నిక జరుగుతుంది. అద్యక్ష ఎన్నిక, ఉపాధ్యక్ష, కోశాధికారి ఏకగ్రీవం కావడంతో ఉత్కంఠగా సాగాల్సిన ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ప్రధాన కార్యదర్శికి మక్కపల్లి రమేష్, బుర్ర కుమార్, MA మతీన్, కార్యదర్శిగా కుడికల ప్రభాకర్, కోట సంపత్, EC మెంబర్లుగా కుడికాల ప్రభాకర్, కoదల రమేష్, ముషం రాజేంద్రము, తేలుకుంట్ల వేణులు పోటీ పడుతున్నారు. ఈ పదవులకు పోటాపోటీగా ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్షుడు గా కొమురవెల్లి హరిప్రసాద్, ఉపాధ్యక్ష పదవికి మండల యాదగిరి, కోశాధికారిగా చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు రెండు బూత్ లు ఏర్పాటు చేశారు. మొత్తం 926 ఓటర్లు ఉన్నారు. పోలీస్ బందోబస్త్ మధ్య ఎన్నికలు స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో జరుగుతున్నాయి. ఉదయం కొద్దిగా ఊపు అందుకోగా కొద్దిసేపటికి ఆ ఊపు తగ్గడంతో ఓటు బ్యాంకు, పోలింగ్ శాతం తగ్గే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనాప్పటికీ మూడు పదవులు ఎవరిని వరిస్తాయోనని వాకర్స్ లో ఆత్రుత నెలకొంది.


ఎన్నికల నిర్వహిస్తున్న నిర్వహణ కమిటీ.. ఓటింగ్ లో క్యూ లైన్ లో నిలుచున్న వాకర్లు

ఓటు హక్కు వినియోగించుకున్న వాకర్ సభ్యుడు..

బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు..






