
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామ గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం సభ్యులు ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కేశబోయిన ఓదెలు, ప్రధాన కార్యదర్శిగా కేశబోయిన అశోక్ యాదవ్, ఉపాధ్యక్షుడిగా కేశబోయిన లింగయ్య ఎన్నికయ్యారు. అలాగే డైరెక్టర్లుగా నాని రమేష్, మేడుదుల రాజు, కేశబోయిన కేతమ్మ, గుంపుల రాజమ్మ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు సాయంత్రం ప్రకటించారు. కాగా నూతనంగా ఎన్నికైన సంఘం నాయకులను సంఘ సభ్యులు శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

అధ్యక్షుడిగా ఎన్నికైన కేశబోయిన ఓదేలు.

ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కేశబోయిన అశోక్ యాదవ్





