
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: న్యాయ స్థానాలు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయక బేఖాతారు చేయడం అత్యంత శోచనీయం. తపాలా ఉద్యోగుల సంక్షేమం మరియు చట్ట బద్ధ మైన హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తున్న అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్“ సి “ కి మరియు ఎన్ ఎఫ్ పి ఈ కి వెంటనే గుర్తింపును పునరుద్దరించాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కామ్రేడ్ యు మహేందర్, కామ్రేడ్ ఏ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య భారత దేశంలో అత్యున్నత న్యాయ స్థానాలు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయక ఉద్యోగ సంఘాలను అణచి వేసే ధోరణి అత్యంత శోచనీయమని తెలంగాణ రాష్ట్ర అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ ఉకంటి మహేందర్, కామ్రేడ్ అద్దెట్ల శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతంగా నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ వెంటనే ఉపసంహారణ కోసం దేశ వ్యాప్తంగా రైతులు చేపట్టిన రైతాంగా పోరాటానికి ఆర్థిక మద్దతును, సంఘీభావాన్ని ఇచ్చిందన్న కల్పిత, నిరాధార ఆరోపణలతో కూడిన ఫిర్యాదును స్వీకరించిన తపాలా శాఖ సీసీఎస్ -ఆర్ ఎస్ ఏ -1993 రూల్స్ ప్రకారం ఎన్ ఎఫ్ పి ఈ మరియు దాని అనుబంధ సంఘం ఏఐపి ఈయు -గ్రూప్ “ సి “ కి పోస్టల్ డైరెక్టరేట్ 26-04-2023 న గుర్తింపును ఉపసంహారించిందన్నారు. దీనివల్ల తపాలా ఉద్యోగ సంఘానికి అధికారులతో ఉన్న సంప్రదింపుల హక్కులకు విఘాతం కలిగిందన్నారు. వీటితో పాటు చట్ట బద్ధమైన, సంస్థాగత విధులల్లో పాల్గొనకూడదని డైరెక్టరేట్ ఆదేశాలలో అక్షేపింపబడినవన్నారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఉద్యోగ సంఘం దేశంలోని ప్రధాన హై కోర్ట్ లలో పోస్టల్ డైరెక్టరేట్ ఆదేశాలు ఉపసంహారించు చుకోవాలని తపాలా ఉద్యోగ సంఘం రిట్ పిటిషన్లను సమర్పించగా రాంచి -జార్ఖండ్ హై కోర్ట్ 12-4-2024 న అక్షేపింపబడిన డైరెక్టరేట్ ఆదేశాలపైన స్టే ఆర్డర్ విధించి మునుపు ఉన్న అన్ని హక్కులు ఉద్యోగ సంఘానికి తుది తీర్పు వేలువడే వరకు కొనసాగించాలని తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. అయినా ఉద్దేశపూర్వకంగా కోర్ట్ తీర్పును అమలు చేయక పోవడం శోచనీయమని, సుప్రీం కోర్ట్ సైతం 24.9.24 న తుది తీర్పు వేలువడేవరకు హై కోర్టులు ఇచ్చిన స్టే ఆర్డర్లు కొనసాగించాలని కేసును హై కోర్టుకు తిరిగి బదిలీ చేసే క్రమంలో ప్రకటించడం జరిగినదన్నారు. నిరాధార, కల్పిత లేదా ఒక వ్యక్తి చేసిన తప్పుకు పూర్తి సభ్యులు ఆధారపడిన సంఘాన్ని ప్రమాదంలో నెట్ట కూడదని అందుకే తుది తీర్పు వరకు రాంచి హై కోర్ట్ స్టే ఆర్డర్ కొనసాగించి అన్ని హక్కులు కల్పించి సభ్యత్వ రుసుము చెల్లించే సభ్యుల సంక్షేమం చూడాలని పేర్కొన్నదన్నారు. చివరికి 18.2.25 న రాంచి హై కోర్ట్ తన తుది తీర్పును వెలువడిస్తూ తపాలా ఉద్యోగ సంఘాలకు సంబందించిన 5సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే గుర్తింపు 18.7.2024 తో ముగిసిందని, 18.7.2025 వరకు అన్ని సంఘాలకు ఒక సంవత్సరం గుర్తింపు గడువు పొడ గించినందున ఎన్ ఫ్ పి ఇ మరియు దాని అనుబంధ సంఘం ఏఐపి ఈయూ గ్రూప్ సి సంఘాలకు సభ్యత్వ ధ్రువీకరణ ప్రక్రియ ముగిసేంతవరకు అన్ని గుర్తింపు సంఘాల మాదిరిగానే మునుపటి అన్ని హక్కులు మూడు నెలల గడువు లోగ కల్పించాలని తీర్పునిచ్చిందని తెలిపారు. మూడు నెలలు దాటినా ఉద్దేశ పూర్వకంగా ఈ ప్రభుత్వం తపాలా శాఖకు ఉద్యోగ సంఘానికి గుర్తింపును పునరుద్దరణ చేస్తూ సంస్థాగత హక్కులు కల్పించాలనే ఆదేశాలు ఇవ్వడం లేదని తెలుపుతూ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తిగారైన గౌరవ జస్టిస్ బిఆర్ గవాయి కి తమ హక్కుల కోసం, సంక్షేమం కోసం సంఘంలో కొనసాగుతున్న 65% సభ్యులు ఆధార పడ్డ మెజారిటీ సంఘానికి అన్ని హక్కులు కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకొని సంఘానికి గుర్తింపు పునరుద్దరణ చేసేలా ప్రభుత్వ్తానికి, పోస్టల్ డైరెక్టరేట్ కి ఆదేశాలు జారీ చేయాలనీ అఖిల భారత తపాలా ఉద్యోగుల గ్రూప్ “సి ”కేంద్ర సంఘం కార్యదర్శి కామ్రేడ్ నరేష్ గుప్తా వినతి పత్రం సమర్పించినరాని తెలిపారు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న మొదటి తపాలా ఉద్యోగుల సంఘం ఎన్ఎఫ్ పిఈ మాత్రమే అని, ఇది దేశాన్ని ప్రేమించే దేశ భక్తుల సంఘమని, సభ్యుల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తున్న, తపాలా శాఖకు అనుక్షణం వెన్నముఖగా నిలుస్తు తపాలా శాఖ అభివృద్ధికి పాటుపడుతూ, 160 సంవత్సరాల నిర్వీరమా ప్రజాసేవకలిగిన తపాల శాఖ ప్రైవేటికరణను పలుమార్లు అడ్డుకుంటూ నిరంతర ప్రజా శ్రేయస్సును కోరే నిస్వార్థ పూరిత సంఘమని, ఎంతో మంది త్యాగ ధనుల, నాయకుల ఆశయాల పునాదుల మీద నిర్మించ బడ్డ సంఘమని, అలాంటి సంఘాన్ని అణచివేయాలనుకోవడం సరికాదని అన్నారు. వేంటనే రాజ్యాంగానికి లోబడి న్యాయ స్థానాలు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలనీ, ఉద్యోగ సంఘానికి గుర్తింపును పునరుద్దరణ చేయాలనీ తెలంగాణ రాష్ట్ర
ఏఐ పిఈయూ గ్రూప్ సి అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ యూ మహేందర్, కామ్రేడ్ ఏ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేసారు.

తెలంగాణ రాష్ట్ర
ఏఐ పిఈయూ గ్రూప్ సి అధ్యక్షుడు యు మహేందర్

తెలంగాణ రాష్ట్ర ఏఐపిఈయూ గ్రూప్ సి ప్రధాన కార్యదర్శి ఏ శ్రవణ్ కుమార్





