
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆటల్లో గెలవాలంటే క్రమశిక్షణ, నిబద్ధత నియమ, నిబంధనలు ఏ విధంగా అవసరమొ అలాగే మన జీవితాల్లో కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే స్వయం నిబద్ధత అవసరము అని బిఆర్ఎస్ నాయకురాలు ఆకినపల్లి శిరీష సూచించారు. ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పంతో ఉండాలని ఈరోజు చెల్పూర్ ఉన్నత పాఠశాలలో పులాల నరేందర్, శనిగరపు రాజుల ఆధ్వర్యంలో జరిగిన చెల్పూర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో అతిథిగా పాల్గొన్న బిఆర్ఎస్ నాయకురాలు ఆకినపల్లి శిరీష అన్నారు. విజేతలకు కప్పులను బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో చెల్పూరు పెద్ద అయ్యగారు కృష్ణమూర్తి శర్మ , డాక్టర్ బుచ్చి బాబు, మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్, రఘు, రాజు, హుజురాబాద్ ఏఎస్ఐ కమల, చెల్పూర్ గ్రామ పోలీస్ అధికారి(హెడ్ కానిస్టేబుల్) మధు, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.



క్రికెట్ విజేతలకు కప్పు బహుకరిస్తున్న బిఆర్ఎస్ నాయకురాలు శిరీష..





