
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. ఆదివారం హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ లో యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సివిల్ హాస్పిటల్ వర్కర్స్ కాంట్రాక్ట్ టెండర్ పద్ధతిలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారని వీరికి ఉద్యోగ భద్రత లేదని శ్రమ దోపిడికి గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకురాళ్లు స్వరూప, సుమలత, రాధ, తిరుమల, రాజయ్య, శోభ, అనిత, హేమలత, వసంత, కవిత, కళ తదితరులు పాల్గొన్నారు.


