
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతిని హుజురాబాద్: యాదవుల హక్కుల సాధన కోసం ఈనెల 30వ తేదీ సోమవారం హైదరాబాదులో యాదవ ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేసినట్లు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు, యాదవ సంఘం నాయకులు రాజారామ్ యాదవ్ తెలిపారు. ఆదివారం హుజురాబాద్ లో ఆయన యాదవ ఆత్మగౌరవ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు స్థానం కల్పించాలని ఆయన డిమాండ్. ఇప్పటివరకు మంత్రివర్గంలో యాదవులకు చోటు లేని మంత్రివర్గాలు లేవని కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ యాదవులకు స్థానం కల్పించలేదని అన్నారు. యాదవ కార్పొరేషన్ కు పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలని నామినేటెడ్ పదవుల్లో యాదవులకు స్థానం కల్పించాలని ఆయన యాదవుల హక్కుల సాధన కోసం రాష్ట్రంలో ఉన్న యాదవ సోదరులంతా 30న హైదరాబాదులో జరిగే సమావేశానికి హాజరై యాదవులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చెప్పాలని అన్నారు. యాదవులు ఐక్యంగా పోరాటం చేస్తే ఎలా ఉంటుందో ఈ సభ నిరూపిస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు కన్నవేన శ్రీనివాస్ యాదవ్, బత్తుల రాజ్ కుమార్ యాదవ్, మక్కపల్లి కుమారస్వామి, రమేష్ యాదవ్, వేణుమాధవ్, రమేష్, సమ్మయ్య యాదవ్, అశోక్ యాదవ్, ఐలయ్య యాదవ్, ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
