
– కేసీఆర్ కాళేశ్వరం,కేటీఆర్ కారు రేసింగ్,కవిత లిక్కర్ స్కాంల చుట్టూ తిరుగుతూ ఉంటే. ఇవి సరిపోక కౌశిక్ రెడ్డి అనే ముల్లకంపను మీ చుట్టూ తగిలించుకుంటున్నారు.
– బెదిరింపు కేసుకు,కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు.
– దమ్మక్కపేటలో పైప్ లైన్ పనులకు శ్రీకారం.
– బాధిత మహిళా ఫిర్యాదు చేస్తే అది ఫాల్తుకేసా?.
_హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి మా లక్ష్యం..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్దే తమ ప్రధాన లక్ష్యమని, ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కారం చూపిస్తున్నామని, భవిష్యత్ లో మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం రోజున హుజురాబాద్ పట్టణ పరిధిలోని దమ్మక్కపేటలో 20లక్షలతో చేపట్టిన పైప్ లైన్ పనులను ప్రారంభం చేశారు. అనంతరం ప్రణవ్ మీడియాతో మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబానికి తొత్తులుగా మారిన వ్యక్తులు ఎవరు తప్పు చేసిన ఆది ఒప్పు అన్నట్టుగా కేటీఆర్, హరీష్ రావు మాట్లాడడం సిగ్గుచేటని, అసలు కేసు ఎందుకు అయ్యిందో బీఆర్ఎస్ నాయకులు గమనించాలని అన్నారు.ఒక గ్రానైట్ వ్యాపారిని బెదిరించి 50 లక్షల రూపాయలు ఇస్తావా, చస్తావా అని బెదిరిస్తే వ్యాపారి భార్య సుబేదారి పోలీసు స్టేషన్ లో కేసు పెడితే పోలీసులు కేసు నమోదు చేశారనీ,ఏదో ఉద్యమం చేసి రిలీజ్ అయిన వ్యక్తిలాగా సోషల్ మీడియాలో కౌశిక్ రెడ్డి బిల్డప్ ఇవ్వడం చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారని, ఎలాంటి తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ కు ఎందుకు వెళ్లాడనీ?ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి చిల్లర వీధిరౌడీలాగా, రాజకీయ జోకర్ లాగా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు.మహిళ ఫిర్యాదు చేస్తే ఆ కేసు మీకు ఫాల్తు కేసులాగా కనపడుతుందా అని కేటీఆర్, హరీష్ రావు ను ప్రశ్నించారు.ఇదే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 25 లక్షలు ఇచ్చాను అని వ్యాపారి చెప్పింది నిజం కాదా అని, నియోజకవర్గంలో అనేక మందిని ఇబ్బందులకు గురి చేసింది కౌశిక్ రెడ్డి, స్వయంగా బాధితులే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారనీ, ఇంకోసారి కౌశిక్ రెడ్డి స్థాయికి మించిన మాటలు మాట్లాడితే గ్రామాల్లో తిరగనియ్యమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ, మండల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్..


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్…