
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఆదివారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. మంత్రులు వివిధ శాఖల పనితీరుపై ఆరా తీసి, అధికారులకు కీలక సూచనలు ఇవ్వనున్నారు.
