
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ స్వర్గీయ కొత్తపల్లి జయ శంకర్ 14వ వర్ధంతి వేడుకలు శనివారం హుజూరాబాద్ లో ఘనంగా జరిగాయి. పట్టణంలోని పెన్షనర్ భవన్ లో, బాలికల పాఠశాలలో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల కోసం పని చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని, తన జీవితాంతం తెలంగాణ ఏర్పాటుకు భావజాల వ్యాప్తి చేస్తూ కృషి చేసారని ఆయన బాటలో నేటి యువత పయనించాలని ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఆవునూరి సమ్మయ్య , అన్నారు. ఈ సమావేశంలో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఆవునూరి సమ్మయ్య , పాఠశాల హెచ్ఎం బి తిరుమల, రవి శంకర్ శుక్ల, వేల్పుల రత్నం, ఉపధ్యాయులు పీ ఈశ్వర్ రెడ్డి, ఆసియా, రోజారాణి, అర్చన, జె అవస్తి, మాధవిలత, శ్రీలత, మారుతీ ప్రసాద్, విజయ, శ్రీనివాస్, స్వామిరావు, శ్రావణి, మ్యాక రాములు, జమున, శోభరాణి, సదానందం తదితరులు పాలొన్నారు.
– పెన్షనర్ భవన్ లో..
ప్రొఫెసర్ స్వర్గీయ జయశంకర్ 14వ వర్ధంతి వేడుకలు హుజురాబాద్ పెన్షనర్ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఆయన తెలంగాణ ఆవిర్భావానికి చేసిన సేవలను పలువురు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ సంఘం అధ్యక్షులు ఎండి ఉస్మాన్ పాషా, మాజీ కౌన్సిలర్ తాళ్ళపల్లి శ్రీనివాస్, గంజి జయవర్ధన్, కొన్ని రాజిరెడ్డి, లక్ష్మీనారాయణ, గండ్ర సమ్మిరెడ్డి, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఆవునూరి సమ్మయ్య

నివాళులర్పిస్తున్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఆవునూరి సమ్మయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు..

పెన్షనర్ భవన్ లో..