
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇప్పల్ నర్సింగాపూర్ లో పుట్టపాక సమ్మయ్యకి చెందిన 10 మేకలు కుక్కల దాడిలో మృతి చెందాయి. సమ్మయ్య మేకలు తోలుకొని వస్తుండగా ఒక్కసారిగా కుక్కలు దాడి చేసి కొరికి చంపాయి. దీంతో బాధితునికి లక్షకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పల్ నర్సింగాపూర్ లో కుక్కలు నిత్యం స్వైర విహారం చేస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకకోక పోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురివుతున్నారు. ఇప్పటికైనా బల్దియా అధికారులు స్పందించి కుక్కల భారీ నుంచి ప్రజలని కాపాడాలనీ, బాధిత పుట్టపాక సమ్మయ్యని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

కుక్కల దాడిలో మృతి చెందిన మేకల వద్ద దీనంగా కూర్చున్న బాధితుడు సమ్మయ్య..