
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్న నేపథ్యంలో హుజురాబాద్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను శనివారం హుజురాబాద్ పట్టణం లో పోలీసులు బందోబస్తు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో బిఆర్ఎస్ నాయకులు, కొంతమంది హనుమకొండకు తరలి వెళ్లిన నేపథ్యంలో హుజురాబాద్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందు జాగ్రత్తగా ప్రహార కాశారు. ఉదయం నుండి రాత్రి వరకు హుజురాబాద్ నియోజకవర్గం లో కౌశిక్ రెడ్డి కేసు విషయంలో ఏం జరుగుతుందని కార్యకర్తలు నాయకులు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. చివరకు కోర్టు వేలు మంజూరు చేయడంతో కౌశిక్ రెడ్డి అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు.


హుజురాబాద్ చౌరస్తాలో పహార కాస్తున్న పోలీసులు..





