
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: నేటి యాంత్రిక జీవితంలో ఆరోగ్య పరిరక్షణ కోసం తప్పనిసరిగా ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిన అవసరం ఉందని, యోగాతో అందం, ఆనందం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి అన్నారు. శనివారం హుజురాబాద్ పట్టణంలో అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హుజురాబాద్ పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో, కోర్టు సముదాయ భవనంలో, సబ్ జైల్లో, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో, చేల్పూర్ ఉన్నత పాఠశాలలో, సింగపూర్ కిట్స్ కాలేజీలో, బిజెపి ఆధ్వర్యంలో, వికాస తరంగిణి ఆధ్వర్యంలో, డిప్యూటీ డిఎంహెచ్వో ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఏసీపీ మాట్లాడుతూ…భగవంతుడు మానవజన్మ మనకు ఇచ్చినందుకు ఆరోగ్యం కాపాడుకోవాలని ఆరోగ్యానికి మించిన ధనం లేదని అన్నారు ఒకసారి మనిషి అనారోగ్యానికి గురైతే ఆ వ్యక్తితో పాటు ఆ కుటుంబ సభ్యులు ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా నష్టపోతారని అన్నారు అందుకే ప్రతి ఒక్కరూ యోగ జీవన విధానంలో భాగం కావాలని అప్పుడే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతారని అన్నారు. మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య మాట్లాడుతూ… యోగా మన జీవిత గమనాన్ని మారుస్తుందని, మన జీవితంలో ఒక భాగంగా యోగాను మార్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ టి కరుణాకర్, యోగా గురువు దేవునూరి శ్రీనివాస్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఎన్ నారాయణరెడ్డి, డాక్టర్ ప్రసాద్ రావు, డాక్టర్ రవీందర్రావు, డాక్టర్ షబానా అజీజ్, మేనేజర్ భూపాల్ రెడ్డి, వాకర్స్ అధ్యక్షులు అధ్యక్షులు హరి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మతిన్, ఉపాధ్యక్షుడు మండల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
– కోర్టు ఆవరణలో…
యోగా దినోత్సవం వేడుకలు హుజురాబాద్ కోర్టు సముదాయ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి పద్మసాయి శ్రీ, ఏసిపి మాధవి, సిఐ కరుణాకర్, బార్ అధ్యక్షులు యతిపతి అరుణ్ కుమార్, రమేష్, శ్రీనివాస్, రవీందర్ గౌడ్, సిహెచ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
– హుజురాబాద్ సబ్ జైలులో….
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని హుజురాబాద్ సబ్ జైలులో జైలర్ నాంపల్లి దేవేందర్ ఆధ్వర్యంలో ఖైదీలు యోగ చేశారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు కొన్ని రాజిరెడ్డి, ఎండి రఫీ, నగదర్, దేవేందర్ రెడ్డి, రవీందర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
భారతదేశం యోగాను ప్రపంచానికి ఆధ్యాత్మిక వారసత్వంగా అందించింది
-బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు
స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో శనివారం రోజున హుజురాబాద్ డిసిఎంఎస్ కాంప్లెక్స్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. భారతీయ సనాతన ధర్మం ప్రపంచానికి అందించిన అపురూప కానుక యోగ. యోగ ద్వారా మనస్సు శరీరాన్ని ఏకం చేస్తుందని, శారీరక దృఢత్వాన్ని, మానసిక శాంతిని ఆత్మశుద్ధిని చేస్తుందని,యోగ అనేక రుగ్మతలను తొలగిస్తుందని, యోగాను ప్రతిరోజు కార్యక్రమం లాగానే అలవర్చుకోవాలని తెలియజేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ గారు యోగాను విశ్వవ్యాప్తం చేసి నేడు దాదాపు 190 పైగా ప్రపంచ దేశాలు యోగాను అనుసరిస్తున్నాయి అన్నారు. చైనా అమెరికా జపాన్ వంటి దేశాలు తమ పాఠశాలల్లో యోగాను ప్రవేశపెట్టాయన్నారు. వన్ ఎర్త్ వన్ హెల్త్,ప్రపంచ శాంతిని ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేది భారతదేశం అన్నారు.
ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు శ్రీనివాస్ రెడ్డి, కొమురవెల్లి సదానందం, కళ్లెపు సుధాకర్ రావు, మెరుగు రాజిరెడ్డి, కార్యక్రమ కన్వీనర్ గంగిశెట్టి ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ పైళ్ల వెంకటరెడ్డి, నల్ల సుమన్, కార్యక్రమం కో కన్వీనర్ బోరగల సారయ్య, కొలిపాక వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, సీనియర్ కోలిపాక శ్రీనివాస్, నాయకులు తిప్పబత్తిని రాజు, యాల సంజీవరెడ్డి, సబ్బని రమేష్, ఓబిసి మోర్చా పట్టణ అధ్యక్షులు గంట సంపత్, మునిగంటి నాగరాజు, విక్రమ్, గంధం సంతోష్, తూర్పాటి సునీల్, అనిల్, బూతం సాయిరాం, శ్రీ రంగం, ఇలాసాగరం వీరస్వామి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో బల్దియా- వాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ డే వేడుకలు..


సబ్ జైల్లో యోగ డే వేడుకలు నిర్వహిస్తున్న దృశ్యం..

ఏరియా ఆసుపత్రిలో సిబ్బందికి యోగ నిర్వహిస్తున్న సూపరిండెంట్ నారాయణరెడ్డి..


చేల్పూర్ పీహెచ్సీలో యోగ కార్యక్రమం నిర్వహిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉపాధికారి డాక్టర్ చందు..



బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో డిసిఎంఎస్ కాంప్లెక్స్ లో యోగ మెడికల్ నిర్వహిస్తున్న దృశ్యంలు…

వికాస తరంగిణి ఆధ్వర్యంలో..





