
Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గజర్ల అశోక్, ని వారి స్వగ్రామం వెలిశాలలో జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ వాసాల రామస్వామి మర్యాదపూర్వకంగా కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి, అమరుడైన గాజర్ల రవి ఫోటోకి పూలమాలలు వేసి, కన్నీటి జోహార్లు తెలుపుతూ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సమసమాజ స్థాపన కోసం పోరాటం చేసిన గజర్ల రవికి జోహార్లు తెలుపుతున్నామన్నారు. ఉన్న ఊరిని కన్న వాళ్ళని వదిలి ఈ సమాజమే నా తల్లిదండ్రులు అంటూ, సమాజ విముక్తి తన ముందున్న కర్తవ్యం అని అడవి బాట పట్టరన్నారు. మావోయిస్ట్ ఉద్యమంలో దశాబ్దాల కాలం పనిచేసి సమసమాజ స్థాపన కోసం అమరులయ్యారని ఈ సందర్బంగా పేర్కొన్నారు. వాసాల రామస్వామితో పాటు కుమార్ యాదవ్, అజయ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
