
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్ర మరువలేనిదని, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనునిత్యం పరితపించి ఐదు దశాబ్దాల తెలంగాణ పోరాటానికి మార్గ దర్శకుడిగా నిలిచిన జయశంకర్ సార్ పాత్ర తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో మరువలేనిదని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.
ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మదీనా కాంప్లెక్స్ వద్ద నెలకొల్పిన ఆయన విగ్రహానికి పోలాడి రామారావు నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ
రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా తన యావత్ జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా ఆచార్య జయశంకర్ సార్ తన జీవితాన్ని గడిపారని అన్నారు. మలిదశ ఉద్యమానికి సిద్ధాంత కర్తగా నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ధాతగా జయశంకర్ సార్ నిలిచారని ఆయన కొనియాడారు.
మా తెలంగాణ మాగ్గావాలి అని విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమానికి ఎలుగెత్తి, మలి దశ ఉద్యమంలో ఆచార్య జయశంకర్ సార్ సిద్ధాంత కర్తగా కీలకంగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్ర కల సాకారమైనా రాష్ట్ర ఏర్పాటును కళ్ళారా చూడకుండానే కన్నుమూసిన జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా నేడు ప్రజా సంఘాల తరపున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణా రాష్ట్ర సాధనలో ప్రజల్లో చెరగని ముద్ర వేసిన జయశంకర్ సార్ చేసిన సేవలు స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించినట్లు రామారావు తెలిపారు. జయశంకర్ సార్ జీవితం నేటి యువతరానికి ఆదర్శం, స్ఫూర్తిదాయకం అని పోలాడి రామారావు అభిప్రాయపడ్డారు.



జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న పోలాడి రామారావు