
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జులై 15: హుజురాబాద్ పట్టణం మరియు జమ్మికుంట మండలంలోని ప్రయాణికులు మల్లూరు, మేడారం, రామప్ప, లక్నవరం వెళ్ళే వారికి ప్రత్యేక బస్ అవకాశం కల్పిస్తున్నామని హుజురాబాద్ డిపో మేనేజర్ వీ రవీంద్రనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జూలై 20 తేదీన ఉదయం 06:00 గంటలకు హుజురాబాద్ డిపో నుండి ప్రత్యేక బస్ ఏర్పాటు చేశాం అని ప్రయాణికులకు ఈ అవకాశాన్ని వినియోగించూకోవాలని కోరారు. బస్ టికెట్ ధర పెద్దలకు 800 /- మరియు పిల్లలకు 430 /- అడ్వాన్స్ బుకింగ్ కొరకు DM: 9959225924 STI: 9704833971 మరియు 9866117385, 9247159535, 9177324963 సంప్రదించండి అని హుజురాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు. అలాగే ప్రయాణికులతో పాటు, విహార యాత్ర కోసం వెళ్ళే వారికి మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విజ్ఞాన విహార యాత్రలకు అతి తక్కువ ధరకు స్పెషల్ బస్ ఇస్తాము అని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని వినియోగించూకోవాలని హుజురాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ కోరారు.

విహారయాత్రకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్





