Oplus_16908288
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పిల్లల కోసం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, మెజారిటీ ప్రజలకు నష్టం వాటిల్లే ఈడబ్ల్యూఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అగ్రవర్ణ పిల్లల కోసం ఉద్యమాలు లేకున్నా డిమాండ్ లేకున్నా పార్లమెంట్లో చట్టం చేశారనీ, అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత వల్ల బీసీ ఎస్సీ ఎస్టీలకు నష్టం జరుగుతుందని, మూడు శాతం ఉన్న అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ ఏమిటని, 50 శాతం పరిమితి రిజర్వేషన్ల అది దాటరాదని చట్టం చెప్తుందని, పార్లమెంటులో అగ్రవర్ణాల పార్టీలన్నీ కలిసి బిల్లు పాస్ చేసుకుని చట్టం చేశారనీ, దేశమంతా అమలు పరుస్తున్నారనీ కింది వర్గాలకు నష్టం జరుగుతుందని తెలిసి పెద్ద కుట్రలో భాగమే 10 శాతం రిజర్వేషన్అ మలు పరచడమని అన్నారు. ఈ దేశ మూల నివాసులైన ఎస్సీ ఎస్టీ బీసీలు ఆలోచన చేసుకొని ప్రశ్నించాల్సిన అవసరం ఉందనీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఈ చట్టానికి వ్యతిరేకంగా ఐక్యం కావాలని, ఎక్కువ మార్కులు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీలు ఉద్యోగ రంగాలలో విద్యారంగాలలో తీవ్రంగా నష్టపోతున్నారని ఇప్పటికైనా మేల్కొని ఈ డబ్ల్యూఎస్ కు వ్యతిరేకంగా ముందుకు కదలాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సేవ్ ద ట్రీ గౌరవ అధ్యక్షులు సాదుల రవీంద్రబాబు, డిటిఎఫ్ నాయకులు వేల్పుల రత్నం, మాజీ సర్పంచ్ పంజాల రామ్ శంకర్ గౌడ్, రిటైర్డ్ ఎంఈఓ ఇలాసాగరo వీరస్వామి, బీసీ కుల గణన మండల కన్వీనర్ మార్త రవీందర్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు డాక్టర్ సంఘము ఐలయ్య, కాంగ్రెస్ నాయకుడు కొలిపాక సారయ్య, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, బండ కిషన్, మేకల రవీందర్, తునికి వసంత్, రావుల పుల్లచారి, ఎం రమేష్ యాదవ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






