
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:అమెరికా సామ్రాజ్యవాదానికి బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం వంత పాడుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ఆరోపించారు. సిపిఎం పార్టీ హుజూరాబాద్ మండల శాఖ సమావేశం కొప్పుల శంకర్ అధ్యక్షతన గురువారం రోజున స్థానిక సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి హాజరై మాట్లాడారు. ఇరాన్ పై, ఇజ్రాయిల్ చేస్తున్న, ఏకపక్ష దాడులను ఖండించకుండా, అమెరికా ట్రంప్, యుద్ధ విమానాలతో ఇరాన్ పై దాడి చేయడం పశ్చిమాసియా దేశాలలో అగ్రరాజ్య ఆధిపత్యాన్ని చలాయించాలని చూడడం, యుద్ధంతో ప్రజల ప్రాణాలు తీస్తూ, ఆర్థిక అస్థిరతను కల్పిస్తూ, విధ్వంసం సృష్టిస్తూ, మళ్లీ తన వల్లనే ఇరుదేశాలలో శాంతిని కోల్పోననీ. ట్రంపు చేస్తున్న తప్పుడు ప్రచారానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. భారత్, పాకిస్తాన్ దేశాల అంతర్గత విషయాల మధ్యలో కూడా చొరబడి ఇదే రకమైన నీతిని ట్రంపు ప్రదర్శించారని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరు వాసుదేవరెడ్డి పేర్కొన్నారు.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి, తర్వాత అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు అంతకంటే ఘోరంగా ఎమర్జెన్సీని తలపిస్తూ తన పరిపాలన సాగిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వానికి పట్టిన గతే పట్టక తప్పదని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం తన అధికారాన్ని కాపాడుకునేందుకు, ప్రశ్నించే గొంతులను నొక్కి వేస్తూ, పత్రికా విలేకరులను రచయితలను, మేధావులను, జైల్లో వేస్తూ, నిర్బంధిస్తూ, ప్రజా పోరాటాలను అణిచివేస్తూ, ప్రకృతి సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను, మొత్తం కార్పోరేట్ శక్తులకు విదేశీ, స్వదేశీ బడా పెట్టుబడుదారులకు కట్టబెడుతూ, దేశంలో ఆర్థిక అసమానతలు పెంచి పోషిస్తూ, నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు, లేకుండా చేస్తూ, కులం, మతం, ప్రాంతాల మధ్య వైశామ్యలు సృష్టిస్తూ, అధికారమే ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ బిజెపి పరిపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు, కదీరే రమేష్, రాచపల్లి సారయ్య, శంకర్, రత్నాకర్, చిరంజీవి, రఘు, చాగర్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి..






