
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఓటర్ నమోదుపై బిఎల్ వో లు, సూపర్వైజరులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, నిబంధనల ప్రకారమే వాటిని నిర్వహించాలని హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు అన్నారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాలలో బిఎల్ వో లు, సూపర్వైజర్లకు ఓటర్ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సలహాలు సూచనలు వారికి అందజేశారు. ఎన్నికల సంఘం రూపొందించిన నియమాల ప్రకారం వాటిని పూర్తిచేయాలని ఆయన కోరారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా ఓటర్ నమోదు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ తాసిల్దార్ కే కనకయ్య, మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య, ఆర్ ఐలు శేఖర్, రంజిత్ రెడ్డి, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బిఎల్ఓ లకు ఓటర్ నమోదుపై అవగాహన కల్పిస్తున్న ఆర్డీవో రమేష్ బాబు

నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆర్డిఓ రమేష్ బాబుతో సహాయ ఎన్నికల అధికారి, తాసిల్దార్ కనుకయ్య, బిఎల్వోలు, రెవెన్యూ సిబ్బంది..
————————+++++++——————-
#పత్రికా ప్రకటనలు (యాడ్స్)@
—————–+++++———————————







