
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (ఫర్ లోకల్ బాడీస్) డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అన్ని వార్డులను సందర్శించారు. రోగులను అడిగి అందుతున్న సేవలు గురించి ఆరా తీశారు. వైద్య సిబ్బంది సక్రమంగా వస్తున్నారా లేదా తెలుసుకున్నారు. ఆరోగ్య మహిళ శుక్రవారం సభల కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సీజనల్ డిసీజెస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వారి వెంట వైద్యాధికారి డాక్టర్ మధుకర్ సిబ్బంది పాల్గొన్నారు.



చేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పలు వివరాలు అడిగి తెలుసుకుంటున్న జిల్లా అదనపు కలెక్టర్
————————-+++++++++—————-
&పత్రికా ప్రకటనలు (యాడ్స్)&
————————+++++++++—————-
##వార్షికోత్సవ శుభాకాంక్షలు##






