
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జులై 17: హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల డీపీఇపిలో విద్యార్థులందరితో మెహందీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ చక్రధర్ మాట్లాడుతూ మెహందీ అనేది శుభ సూచకానికి గుర్తు అని, సౌందర్య సాధనమని, ఆనందాన్ని కలిగిస్తుందని, ఒక సంప్రదాయo అని అన్నారు. సంతోషకరమైన వాతావరణమని, ఒత్తిడిని తగ్గిస్తుందని, ఆరోగ్యకరమైనది అని తెలుపుతూ దీనిలో యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయన్నారు. అవి శరీరాన్ని చల్లబరుస్తాయని, వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయని అందువల్ల ఈ కార్యక్రమాన్ని మన పాఠశాలలో నిర్వహిస్తున్నామని తెలియజేశారూ. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు తాళ్ల తిరుపతి, అంగన్వాడి సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మెహందీ తో చిన్నారుల కేరింతలు…
—————++++++++————————-
&పత్రికా ప్రకటనలు (యాడ్స్) &
——————+++++++++————————-
##వార్షికోత్సవ శుభాకాంక్షలు##






