మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్ లో అతిధి అధ్యాపక పోస్టుకై అర్హులు దరఖాస్తు చేసుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి ఇందిరాదేవి అన్నారు. కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్ లో ఒక పోస్టు ఖాళీగా ఉందని, ఆసక్తి కలిగిన పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55 శాతం మార్కులు, నెట్, సెట్, పీహెచ్ డి, వారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. బోధన లో అనుభవం ఉన్నవారికి వెయిటేజీ ఉంటుందని, ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 25 వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటల లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ నెల 26 వ తేదీ ఉదయం 10 గంటలకు కళాశాలలో ఇంటర్వ్యూ కు ఒరిజినల్ సర్టిఫికెట్స్ లతో హాజరుకావాలని కోరారు.





