
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ బుధవారం హుజురాబాద్ డివిజన్ లో సక్సెస్ అయింది. ప్రైవేటు విద్యాసంస్థలు ముందుగానే సెలవులు ప్రకటించగా, ప్రభుత్వ పాఠశాలు ఏఐఎస్ఎఫ్ నాయకుల సూచనలతో బందు పాటించినట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యాసంస్థల్లో అనేక తప్పిదాలు జరుగుతున్నాయని ఆయన ప్రభుత్వంలో చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కనీసం చదువుకోవడానికి తరగతి గదులు, మరుగుదొడ్లు శుభ్రంగా లేవని, మధ్యాహ్న భోజనం ఆరు బయట చేయడంతో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారుఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాంపేల్లి రోహిత్, మండల నాయకులు రాహుల్,గణేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


విద్యాసంస్థల వద్ద జండాలతో నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘం నాయకులు…





