
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో ఆరుగురూ విద్యార్థులను ఎలుకలు కొరకడంతో, ఎలుకల బెడదతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. శుక్రవారం ఉదయం పాఠశాల భవనంలోని ఒక గదిలోకి చొరబడిన ఎలుక ఇద్దరు విద్యార్థులను రక్షిత్ 8వ తరగతి , యశ్వంత్ 9వ తరగతి చదువుతుండగా ఒకరికి కాలు, మరొకరికి ఏలుకు గాయం అయింది. అయితే ఆ గదిలో 12 మంది ఉండగా ఆరుగురు విద్యార్థులను ఎలుకలు కొరకగా, గాయపడిన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సైదాపూర్ మండలానికి చెందిన ఈ గురుకులం ప్రస్తుతం హుజురాబాద్ పట్టణంలోని ఓ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. పాఠశాల సమీపంలో రైస్ మిల్లు ఉండటం, ఆవరణలో చెత్తాచెదారం అధికంగా ఉండటంతో ఎలుకలు అధికంగా విస్తరిస్తున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఏ రాణి మాట్లాడుతూ… ఎలుకల నివారణకు బోన్లు, వలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గాయపడిన విద్యార్థులతో పాటు ఆ గదిలో ఉన్న 11 మంది విద్యార్థులకు ముందు జాగ్రత్త చర్యగా వైద్య సేవలు అందించామని చెప్పారు. తల్లిదండ్రులు పాఠశాలలో పరిసరాల అపరి శుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురుకుల విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
అలాగే సాయంత్రం హుజూరాబాద్ పట్టణంలో ఉన్న సైదాపూర్ మహాత్మా జ్యోతిరావు ఫూలే బిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ లో విద్యార్థులను ఎలుకలు కొరికిన విషయం పై విచారణ చేపట్టిన అధికారులు. రెసిడెన్షియల్ హాస్టల్ కు వచ్చి విచారణ చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జాయింట్ సెక్రటరీ తిరుపతి, కరీంనగర్ రీజనల్ కోఆర్డినేటర్ అంజలి.
గత రెండు రోజుల్లో పదకొండు మంది విద్యార్థులకు ఎలుకలు కోరికినట్టు నిర్ధారణ. సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పై అధికారులకు నివేదిస్తామనీ వెల్లడి.

గురుకుల పాఠశాల…

గురుకుల పాఠశాల చదువుతున్న విద్యార్థులు..

గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఏ రాణి….





ఎలుకల దాడిలో గాయపడినట్లు చూపెడుతున్న విద్యార్థులు..





