
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలము చెల్పూర్ ఇంద్రానగర్ మదీనా మజీద్ నూతన కార్యవర్గంను శుక్రవారం రోజు జుమ్మా నమాజు తర్వాత హుజురాబాద్ డివిజన్ మస్జీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అసోసియేట్ అధ్యక్షులు మహమ్మద్ జాకీర్ అధ్యక్షతన ఇంద్రానగర్ మదీనా మజీద్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది.
అధ్యక్షులుగా మహమ్మద్ హఫీజ్, అసోసియేట్ అధ్యక్షులు మహమ్మద్ నజీర్ కౌసర్, ఉపాధ్యక్షులు 1 మహమ్మద్ అక్బర్ మహమ్మద్ అష్రఫ్ మహమ్మద్ జాకీర్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ రుస్తం, జాయింట్ సెక్రెటరీ మహమ్మద్ చాంద్ భాయ్,
కోశాధికారి మహమ్మద్ వహీద్, కార్యవర్గ సభ్యులుగా మహమ్మద్ అఫ్రో ఖాన్, మహమ్మద్ అక్రం, మహమ్మద్ ఇమామ్, మొహమ్మద్, మహమ్మద్ హమీద్, తదితరులు నూతనంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా హుజురాబాద్ డివిజన్ మస్జీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ మదీనా మజీద్ చుట్టూ ప్రహరీ గోడ ముస్లింల కబ్రిస్తాన్ 20 గుంటల స్థలం కొరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ మదీనా మజీద్ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చి స్థలం కొరకు విజ్ఞప్తి చేద్దాం అన్నారు. అభివృద్ధి నిధులు కొరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి ప్రణయ్ బాబుతోపాటు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డికి కూడా విజ్ఞప్తి చేద్దాం అని అన్నారు. మన సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు వారి ద్వారా మన యొక్క సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నం చేద్దామని సూచించారు. అలాగే నిరుద్యోగులకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేద్దాం అన్నారు. హుజురాబాద్ డివిజన్లో మసీదులలో పనిచేస్తున్న ఇమామ్ మరియు మోజాన్ నెలవారీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్న దానికి సంబంధించిన ప్రతి మజీద్ ఇమామ్ మరియు మౌజాన్లు వారి యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, 2 ఫోటోలు, ఇన్కమ్ సర్టిఫికెట్ ఏ మస్జిదులో ఇమామ్ మరియు మౌజన్లు పనిచేస్తున్నారో ఆ మజీద్ కమిటీకి సంబంధించిన అధ్యక్షుడు ద్వారా ఒక లెటర్ ప్యాడ్ మీద వీరి యొక్క పూర్తి వివరాలు జతపరిచి కరీంనగర్ జిల్లా waqt board ఇన్స్పెక్టర్ అందించాలని ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వారందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ముందు రఫీ, మహమ్మద యూసుఫ్, మొహమ్మద్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.


ఇందిరానగర్ మదీనా మజీద్ నూతన కమిటీ నాయకులతోహుజురాబాద్ డివిజన్ మస్జీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్





