
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఈనెల 27న పట్టణంలోని మన సురక్ష ఆసుపత్రిలో ఏవిస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ తొగరు విద్యాసాగర్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వెరికోస్ వేయిన్స్, కాళ్లు వాపు, మంట, దురద, కాళ్లలో రంగు మారటం, నరాలు ఉబ్బటం, కాళ్లలో పుండ్లు ఏర్పడడం, బరువెక్కడం వంటి సమస్యల పై పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రముఖ క్రిటికల్ కేర్ వైద్య వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. ఎలాంటి కోతలు, కుట్లు లేకుండా చికిత్స నిర్వహిస్తారని చెప్పారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, అధునాతన లేజర్ చికిత్స నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

డాక్టర్ తొగరు విద్యాసాగర్





