
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మరియు మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటుపై చర్య తీసుకోవాలని జమ్మికుంట పట్టణ సిఐ రామకృష్ణకి దరఖాస్తు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేశిని కోటి, సుంకరి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రుల ఫోన్ ట్రాప్ చేస్తున్నాడని క్యాబినెట్ మీటింగ్ జరగకుండా ఢిల్లీలో పంచాయతీ జరుగుతుందని ఆధారాలు లేని ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రులను కాంగ్రెస్ పార్టీని బదనం చేస్తున్నాడని తన ఆరోపణలు ఎంత మాత్రం నిజం లేదు కౌశిక్ రెడ్డి పేపర్లలో టీవీలలో హైలెట్ కావడం కోసమే ఇలాంటి పదాలను వాడుతున్నాడని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో 119 మంది శాసనసభ్యులు ఉన్న ఈ రాష్ట్రంలో పాడి కౌశిక్ రెడ్డి ఒక్కడే ఇంత చిల్లర మాటలు మాట్లాడుతున్నాడనీ, 118 మంది శాసనసభ్యులందరు ఎంతో హుందాగా ఉంటున్నారన్నారు. కేవలం కౌశిక్ రెడ్డి ఒక్కడే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడనీ, .ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుండి ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా కేవలం కేసీఆర్ కుటుంబానికి బానిసగా బతుకుతున్నాడని వారు ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి వోడితల ప్రణవ్ బాబు గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల సమస్యలు పట్టించుకుంటూ ఇన్చార్జి మంత్రి కోటాలో వచ్చే నిధులను ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తుంటే గెలిసిన ఎమ్మెల్యే ఈ ప్రాంతాన్ని మరిచిపోయి కేవలం ఆర్భాటాలకు ప్రెస్సులో హైలెట్ కావడం కోసం పేపర్లో రావడం కోసం పాకులాడుతున్నాడన్నారు. ముఖ్యమంత్రి పైన, మంత్రులపైన మా కాంగ్రెస్ పార్టీ పైన అనుచిత వాక్యాలు చేస్తే ఈ ప్రాంతంలో మేము తిరగనియ్యమని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేశ్వరరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట స్వప్న, పొనగంటి మల్లయ్య, గూడెపు సారంగపాణి, మాజీ కౌన్సిలర్లు బొంగోని వీరన్న, ఎలగందుల స్వరూప శ్రీహరి, శ్రీపతి నరేష్, పిట్టల శ్వేత రమేష్, పొనగంటి సారంగం, కుతాడి రాజన్న, రవికంటి రాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముద్దమల్ల రవి, మండ అశోక్, ఆడెపు కిరణ్, పాతకాల అనిల్, లింగారావు, ఎండి సలీం, పిడుగు భాగ్యలక్ష్మి, యువజన కాంగ్రెస్ నాయకులు పంజాల అజయ్, కమలాకర్, సుధాకర్, కోరపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, దొగ్గల భాస్కర్, అశోక్, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు..

నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుడు దేశాన్ని కోటి, సుంకరి రమేష్…

జమ్మికుంట సిఐ రామకృష్ణ గౌడ్ కు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు..





