
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు ఇందిరానగర్ కాలనీకి చెందిన యువకులు ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల సైనికుల శౌర్యాన్ని ప్రదర్శిస్తూ దేశ సమగ్రత కొరకు జాతీయ జెండాలు చేత భూనీ ద్వి చక్ర వాహనాలపై తిరుగుతూ తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై, జై జవాన్ జై కిసాన్, ప్రధాని మోడీకి జై అంటూ యువకులు స్వచ్ఛందంగా ద్విచక్ర వాహనాలపై జాతీయ జెండాలు చేత భూని పెద్ద ఎత్తున పట్టణంలో తిరుగుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డుకు చెందిన యువకులు తిరుపతి, చెతర్ సింగ్, హీరా సింగ్, వంశీ, అనిల్, ధారాసింగ్, బచ్చన్ సింగ్, సాయి అనిల్ గుర్దయాల్ సింగ్, నాగరాజు, జీత్ సింగ్, రాజేష్ సింగ్, అజయ్, ఎం అనిల్ బలరాం రంజిత్ సింగ్, రవీందర్ సింగ్, జాన్సన్, బల్జిత్ సింగ్, గోవింద్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.



జాతీయ జెండాలు చేత భూని వాహనాలపై తిరుగుతూ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్న 13వ వార్డు ఇందిరానగర్ కి చెందిన యువకులు…





