
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
భూస్వాములు పెత్తందారులకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసి పోరాటం చేసిన గొప్ప పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలు సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ వద్ద గౌడ సంఘం, బీసీ సంఘాలు,ప్రజా సంఘాల ఆధ్వర్యంలోఘనంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ ప్రాంతంలోని సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలో నుండి పోరాటయోధుడు సర్వాయి పాపన్న చేసిన పోరాటం దేశవ్యాప్తంగా పేరుపొందినన్నారు. భూస్వాముల పెత్తందారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అందరినీ ఐక్యం చేసి వారితో పోరాటం చేయడమే కాకుండా మొగల్ సామ్రాజ్య చక్రవర్తులపై యుద్ధం చేసి ఓడించి పరిపాలన చేసిన తెలంగాణ యుద్ధ వీరుడు పాపన్న అని గుర్తు చేసుకున్నారు. పాపన్న పోరాట తత్వాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు న్యాయవాది ముక్కెర రాజు, మాజీ కౌన్సిలర్లు తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్, చింత శ్రీనివాస్ గౌడ్, నాయకులు కెక్కెర్ల సారయ్య గౌడ్, వేల్పుల ప్రభాకర్, బీసీ ఆజాదీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చిలుకమారి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు పంజాల తిరుపతిగౌడ్, నాయకులు ఇప్పకాయల సాగర్, చిట్టంపల్లి నాగరాజు గౌడ్, సొల్లు మహేందర్, మార్త రవీందర్, తాండవరం విష్ణుమూర్తి, కుమార్, సంగెం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పిస్తున్న గౌడ సంఘం నాయకులు..


పాపన్న విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పిస్తున్న బీసీ సంఘం నాయకులు…
—————-+++++++———————–
&&పత్రికా ప్రకటనలు&&
————————+++++++++——————
##వార్షికోత్సవ శుభాకాంక్షలు##






