
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
ప్రస్తుతం జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ ఏర్పాటుచేసిన యూనిట్ ఇన్చార్జి ఎస్ఐ సురేందర్ మాట్లాడుతూ…మానవ అక్రమ రవాణా పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మండలంలో AHTU మానవులను అక్రమంగా తరలించడం గురించి, సెక్సువల్ అరాస్మెంట్, పిల్లలతో భిక్షాటన చేయించడం, పిల్లలతో లేబర్ పనులు చేయించడం, అవయవాల దోపిడీ, చైల్డ్ మ్యారేజ్, సైబర్ నేరాల గురించి విద్యార్థులకు కులం కశంగా వివరించారు. ఈ అవగాహన సదస్సులో కాకతీయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వేణుమాధవ్, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వర్ రెడ్డి, AHTU సిబ్బంది ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్, మధు పాల్గొన్నారు.

మానవ అక్రమ రవాణాపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్ఐ సురేందర్…

మానవ అక్రమ రవాణాపై రూపొందించిన కరపత్రాలను ,వాల్ పోస్టర్లను ప్రదర్శిస్తున్న ప్రత్యేక టీం, విద్యార్థులు..
——————–++++++++———————
&&పత్రికా ప్రకటనలు&&
——————++++++++++——————
@@వార్షికోత్సవ శుభాకాంక్షలు@@






