
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పిహెచ్సిలోని రికార్డులను తనిఖీ చేసి పిహెచ్సికి వచ్చే రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ తనిఖీలో ఆయన వెంట హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు, పీహెచ్సీ డాక్టర్ మధు, హెచ్ ఈఓ విజయేందర్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ సత్యం, పలువురు సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

చేల్పూరు పిహెచ్సిలో రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ…
———————+++++++———————-
&&పత్రికా ప్రకటనలు&&
—————-++++++—————————–
@@వార్షికోత్సవ శుభాకాంక్షలు@@
తాజా మాజీ ఎంపీపీ ఇరుమల్ల రాణి- సురేందర్ రెడ్డి






