Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను కేబుల్ ఆపరేటర్లు సర్దుబాటు చేయాలని హుజురాబాద్ ట్రాన్స్ కో డివిజనల్ ఇంజనీర్ సంది లక్ష్మారెడ్డి, సహాయ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్ లు అన్నారు. మంగళవారం హుజరాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలను వారు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కొన్ని ప్రాంతాలలో డిష్ కేబుల్ వైర్లు గుత్తులుగా, అడ్డదిడ్డంగా కరెంటు స్తంభాలకు కట్టివేయబడటంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అన్నారు. వీటివల్ల ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, కేబుల్ ఆపరేటర్లు వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లో అన్ని కేబుళ్లను సక్రమంగా సర్దుబాటు చేయాలని అన్నారు. వినాయక చవితి ఉత్సవాలు దుర్గామాత ఉత్సవాలు ఉన్న సందర్భంగా విగ్రహాల తరలింపులో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా భద్రతా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు.వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలలో కూడా ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విగ్రహాల తయారీదారుల కు పలు సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ట్రాన్స్ కో టౌన్ ఏఈ శ్రీనివాస్ గౌడ్ ఇతర విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

———————–++++++++++—————–
&&పత్రిక ప్రకటనలు&&
—————-++++++++++—————-
##వార్షికోత్సవ శుభాకాంక్షలు##






