
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వైద్యం కోసం వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం వైద్య రంగానికి సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, దాంట్లో భాగంగా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకోవడానికి తనిఖీ చేశామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ తెలిపారు. గురువారం హుజూరాబాద్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.దవాఖానలో ఎలాంటి చికిత్స అందిస్తున్నారని, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేరుగా రోగులను అడిగి తెలుసుకున్నారు. నిన్నటిదాకా వర్షాభావ పరిస్థితుల వల్ల రోగాలు ప్రబలే అవకాశం ఉందని, రోగాల బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. తనిఖీ చేసే సమయంలో పలు సమస్యలు ప్రణవ్ దృష్టికి తీసుకురాగా వాటిని అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దవఖాన సూపర్ ఇండెంట్ నల్ల నారాయణరెడ్డి, వైద్యులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.







రోగులను వైద్య సేవలు అందుతున్న దాని గురించి అడిగి తెలుసుకుంటున్న కాంగ్రెస్ నేత ప్రణవ్..





